రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ హామీల అమలులో భాగంగా మరో కీలక ముందడుగు వేసింది. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో భాగంగా సచివాలయ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోంపై సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సర్వే ద్వారా ప్రతి ఇంట్లో 18 నుంచి 50 ఏళ్ల లోపు ఉన్నవారి వివరాలను సేకరిస్తారు. అలాగే యువతీ యువకులకు అవసరమైన స్కిల్స్ నేర్పించి, వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ అవకాశాలు మెరుగుకు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.