మహారాష్ట్రలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పుణేలోని స్వర్గేట్ బస్టాండ్ వద్ద శివషాహి బస్సులో 26 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగింది. ఆ యువతి పుణే నుంచి ఫాల్తాన్‌కు బయలుదేరగా, ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.