కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి అన్ని ఆసుపత్రులలో కోవిడ్-19 బాధితులకు ఉచితంగా వైద్య చికిత్సలు అందించాలని ఆమనగల్లు మండలం పోలేపల్లి ఉప సర్పంచ్ దారెడ్డి అంజన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అర్హులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హర్ష దాయకమన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు వ్యాపార ధోరణితో కాకుండా సేవా దృక్పధంతో కరోనా బాధితులకు సేవలందించాలని అంజన్ రెడ్డి కోరారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి మాస్కులు ధరించాలని కోరారు.