ఆమనగల్లు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు జక్కు అనంత రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం స్థానిక సిగిల్ విండో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. డీసీసీబీ డైరెక్టర్, సింగిల్ విండో చైర్మన్ గంపా వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాయకులతో కలసి అనంత రెడ్డి కేక్ కట్ చేశారు. అనంతరం పలు సేవా కార్యక్రమలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు నిట్ట నారాయణ, తోట గిరి యాదవ్, అప్పం శ్రీను, దోనాడుల కుమార్, సయ్యద్ కలిల్, నరేందర్, కిరణ్, గుత్తి బాలస్వామి, రమేష్ నాయక్, శంకర్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.