అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ఉద్యోగ సంఘ ఎన్నికలు ఆదివారం జరగడంతో కల్వకుర్తి ప్రాంతానికి చెందిన ప్రేమ్ కుమార్ నాయక్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శిగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అందుకు గాను సోమవారం ఆయన ఛాంబర్ లో కల్వకుర్తి బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్, బీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్ల రవి గౌడ్, తదితరులు శాలువాతో సన్మానించడం జరిగింది.