నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలంలో ప్రభుత్వ పాల డైరీ విజయ డైరీ రోజురోజుకు ఉనికి కోల్పోతుంది. కొన్ని దశాబ్దాలుగా విజయ డైరీకి పాలు పోస్తున్న పాల రైతులు కూడా ఇప్పుడు ప్రైవేట్ పాల డైరీల బాటపడుతున్నారు. వంగూర్ మండలంలో విజయ డైరీకి రోజుకు ఆరువేల లీటర్లకు పైగా పాలను పాలు రైతులు విక్రయిస్తున్నారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో విజయ డైరీ రైతులు ప్రైవేట్ పాల డైరీలకు పాలను అమ్మటానికి ఆసక్తి చూపిస్తున్నారు.