కల్వకుర్తి పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఎంతో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు సాగుతుంటాయి. అందులో భాగంగా ఆదివారం అమ్మవారు నాల్గవ రోజు భక్తులకు రాజ్య రాజేశ్వరి అలంకరణలో దర్శనమిచ్చారు. ఎంతోమంది భక్తులు రాజరాజేశ్వరి దేవిని పూజిస్తే సకల సంపదలు కలిగి సకుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉంటుందని వారి నమ్మకం. కన్యకా పరమేశ్వరి దేవాలయ శాశ్వత చైర్మన్ లయన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో అమ్మవారు నిత్య పూజలు పొందడంతో పాటు ఎంతోమంది భక్తులకు రోజుకో రూపంలో దర్శనమిస్తున్నారని అన్నారు.