ఊరుకొండ పేట శివారులోని రెడ్యా తండా ప్రభుత్వ భూముల విషయంలో రైతులు గత కొన్ని రోజులుగా చేస్తున్న నిరసన విషయంలో బీజేపీ నాయకుల ప్రమేయం లేదని బుధవారం బీజేపీ మండల అధ్యక్షుడు ఓర్సు ఆంజనేయులు అన్నారు. హరిజన, గిరిజన వర్గాలే కాకుండా బడుగు, బలహీన వర్గాల సమస్యల కొరకు నిరంతరం పోరాడే పార్టీ బీజేపీ అని ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో అధ్యక్షుడు ఓర్సు ఆంజనేయులు తెలియజేశారు.