నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో రేపటి నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 22న అలంకారం రాజబోగ నివేదన, 23న సంతానార్థులకు గరుడ ప్రసాద వితరణ, 24న ఎదురు కోళ్లు, 25న వెంకటేశ్వర స్వామి కళ్యాణం, 26న నవ కలశ స్నాపనం, 27న చక్ర తీర్థం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రతాపరెడ్డి గురువారం తెలిపారు.