భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ రీఎంట్రీ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు 14 నెలల తర్వాత పేసర్ షమీ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. అయితే, ఇంగ్లాండ్‌తో జరిగిన గత రెండు మ్యాచుల్లో అతడిని పక్కన పెట్టారు. అతని ఫిట్‌గా లేడని అందుకే తుది జట్టులోకి తీసుకోవడం లేదన్న వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ వార్తలపై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ క్లారిటీ ఇచ్చాడు. షమీకి ఎలాంటి గాయం కాలేదని, అతను ఫిట్‌గానే ఉన్నాడని తెలిపాడు.