TG: దేశంలోనే రెండో అతి పెద్ద గిరిజన జాతరైన నాగోబా జాతర సందర్భంగా భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మెస్రం వంశస్థుల ఆధ్వర్యంలో జరిగే నాగోబా జాతర ఐదు రోజుల పాటు వేడుకగా సాగుతుందని, భక్తులు నాగోబాను దర్శించుకుని ఆశీస్సులు అందుకోవాలని సీఎం ఆకాంక్షించారు. అధికారికంగా నిర్వహిస్తున్న ఈ జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారని వెల్లడించారు.