కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి: కలెక్టర్

74చూసినవారు
కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి: కలెక్టర్
కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన సేవలు మరువలేవని అని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జండగే అన్నారు. శుక్రవారం కలేక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుక బడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్బంగా కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ బిసిల అభ్యన్నతి కోసం ఎంతో కృషి చేశారన్నారు.

సంబంధిత పోస్ట్