వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని యాదగిరిపల్లి ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. యాదగిరిపల్లికి చెందిన భూడిద నాగమణి (25)కి సోమవారం మధ్యాహ్నం గ్రామశివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అటుగా వెళ్తున్న పోలీస్ సిబ్బంది శ్రీనివాస్, ప్రభాకర్, శంకర్ లు బావిలోకి దూకి ఆమెను కాపాడారు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోయింది. మెరుగైన వైద్యం కోసం భువనగిరి ఏరియా హాస్పిటల్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ రమేష్ తెలిపారు.