Feb 15, 2025, 06:02 IST/భువనగిరి నియోజకవర్గం
భువనగిరి నియోజకవర్గం
భువనగిరి: దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
Feb 15, 2025, 06:02 IST
భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర భువనగిరిలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బస్టాండ్, రైతుబజర్ , బస్సులో, బ్యాంకు లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. ఆంద్రప్రదేశ్ విజయవాడ చెందిన దుర్గ, మంగ, లక్ష్మీ లను అరెస్ట్ చేశారు. మరో యువకుడు యోహాన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి రూ.3లక్షల 20 వేలు విలువ చేసే 8 తులాల బంగారం, రూ.20 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.