కొండమల్లేపల్లి: గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై జరిగింది. బుధవారం ఎస్సై రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం డిఎం కుంట చెందిన ఏకుల రమేశ్(36) కొండమల్లేపల్లి నుండి డీఎం కుంటకు బైక్ పై వెళ్తుండగా వ్యవసాయం ఉద్యానవనం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.