చందంపేట: కంబాలపల్లి జాతర ఖర్చు కోటికి అటుఇటు

69చూసినవారు
చందంపేట: ఇటీవల మహాలక్ష్మమ్మ జాతర సందర్భంగా సౌండ్ సిస్టమ్స్, ప్రభల లైటింగ్, రికార్డింగ్ డాన్సులతో కంబాలపల్లి గ్రామం దద్దరిల్లింది. గతంలో గ్రామస్తులు జాతరలో ఒకటి రెండు ప్రభలు మాత్రమే పెట్టేవారు. ఆ తరువాత బలం బలగం ప్రదర్శన కోసం ఒక ఇంటి పేరు కలవారు ఒక సమూహంగా ఏర్పడి ప్రభలు ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య పెరుగుతూ ఈ ఏడాది 10 స్టేజీలకు చేరింది. వాటి నిర్వహణ, పండగ ఖర్చులు కలిపి ఈసారి రూ. కోటి అయినట్టు సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్