గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి

52చూసినవారు
గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి
కొండమల్లేపల్లి: గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కొండమల్లేపల్లి సిఐ ధనుంజయ గౌడ్ అన్నారు. బుధవారం శాంతిసంఘం సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు అన్నివర్గాల ప్రజలు సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్