కొండమల్లేపల్లి: ఫుడ్ పాయిజన్ ఘటనలపై విచారణ చేపట్టాలి

62చూసినవారు
కొండమల్లేపల్లి: ఫుడ్ పాయిజన్ ఘటనలపై విచారణ చేపట్టాలి
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై సమగ్ర విచారణ జరిపించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రామావత్ లక్ష్మణ్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఎస్ఎఫ్ఐ నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలల బంద్ కొండమల్లెపల్లిలో విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో ఠాగూర్, మురళి, కార్తీక్, సాయికుమార్, లక్ష్మణ్, చరణ్, అంజి, వెంకట్, మున్నా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్