నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చింతకుంట్లలో గురువారం జరిగిన ప్రజా పాలన గ్రామసభ రసాభసాగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అనర్హులు, భూస్వాముల పేర్లు ఉన్నాయని, అర్హులైన పేదల పేర్లు లేవని గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. సర్వే ఎలా చేశారంటూ అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగి, గ్రామసభను స్పందింపజేశారు.