పోలీసులతో సమావేశమైన ఎమ్మెల్యే

52చూసినవారు
పోలీసులతో సమావేశమైన ఎమ్మెల్యే
నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. దొంగతనాలు, గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, సిఐలు నర్సింహులు, ధనుంజయ్, సురేష్, పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :