అమెరికాలో ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

65చూసినవారు
అమెరికాలో ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బుచ్చిబాబు (40) అమెరికాలో మృతి చెందారు. ముండ్లమూరు గ్రామానికి చెందిన దొద్దాల కోటేశ్వరరావు కుమారుడు బుచ్చిబాబు కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. వీకెండ్ కావడంతో ఫ్యామిలీతో కలిసి సరదాగా బీచ్‌కు వెళ్లారు. ప్రమాదవశాత్తూ బీచ్‌లో నీట మునిగి మృతి చెందాడు. కుమారుడు చనిపోయిన విషయం తెలియడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్