నార్కెట్ పల్లి: చెరువుగట్టుకు పోటెత్తిన భక్తులు

77చూసినవారు
కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా నల్గొండ జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజామునే శివాలయాలకు చేరుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగించారు. ఇక నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పరమశివుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగాయి.

సంబంధిత పోస్ట్