సూర్యాపేట జిల్లా మోతె మండలంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ఉపేందర్ (32) మామిళ్లగూడెం నుంచి తుమ్మలపల్లికి వెళ్తున్నాడు. ఈక్రమంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఉపేందర్ తల ట్రాక్టర్ ఇంజిన్కు తగిలి ఛిద్రమైంది. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.