కోదాడ: ముమ్మరంగా బిజెపి సభ్యత్వం నమోదు
సభ్యత్వ నమోదులో కోదాడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని బిజెపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనూష అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ లో బిజెపి సభ్యత్వ నమోదు ప్రారంభించి మాట్లాడారు. ప్రతి బూత్ లో 200కు పైగా సభ్యత్వం నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నూనె సులోచన, బొలిశెట్టి కృష్ణయ్య తదితరులు ఉన్నారు.