చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని హైవే అండర్ పాస్ వద్ద మురుగునీరు నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం పై సీపీఎం సీనియర్ నేత దేశబోయిన నరసింహా ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎంపీడీవో విజయలక్ష్మీ, గ్రామ కార్యదర్శి లింగస్వామి గ్రామానికి వచ్చి నీరు నిల్వకుండా కాల్వను క్లియర్ చేశారు.