ఆమనగల్లు లో క్రికెట్ పోటీలు ప్రారంభం

1074చూసినవారు
ఆమనగల్లు లో క్రికెట్ పోటీలు ప్రారంభం
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో కొలువైన శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా క్రికెట్ పోటీలు దేవాలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయన్నారు. స్నేహపూర్వక క్రీడలు నిర్వహించుకోవాలని కోరారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. కొండ వెంకన్న, బిక్షం జొజి, కలమ్మ, యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్