షీ టీం కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ

971చూసినవారు
షీ టీం కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ
మహిళల భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు డిఐజి, ఎస్పీ ఏవి రంగనాథ్ తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో షీ టీం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఫిర్యాదు చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన క్యూఆర్‌ కోడ్‌ కరపత్రాలను ఎస్‌హెచ్‌వో మాధురిరెడ్డి, షీ బృందం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ. మహిళలు, బాలికలు బహిరంగ ప్రదేశాల్లో, పనిచేసేచోట వేధింపులు, భౌతిక దాడులకు గురికావడం, ఈవ్‌ టీజింగ్‌, బెదిరింపులకు గురి చేసినా. వెంటనే కరపత్రంలోని క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్