దోస్త్. మేరే దోస్త్.!!

821చూసినవారు
దోస్త్. మేరే దోస్త్.!!
ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్, యువనేత నల్లమోతు సిద్దార్ధకు స్నేహితుల దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి షోయబ్ శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిద్దార్ధ చేతికి ఫ్రెండ్ షిప్ బ్యాండు కట్టి, పూల మొక్కను అందజేశారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కోటేశ్వరరావు, నాయకులు మహేష్ నాయుడు, శ్రీనాథ్, శివ, శ్రీకాంత్, అంజి యాదవ్, వంశీ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్