వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల పదవి విరమణ సభ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచి వలంపట్ల ఝాన్సీ ప్రవీణ్ మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామం కొసం విశిష్ట సేవలను అందించి పదవి విరమణ పొందుతున్న సర్పంచ్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులను గ్రామస్తులు ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు.