చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి గల్లంతు

18080చూసినవారు
నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి(మం)సత్రశాల వద్ద కృష్ణా నదిలో చేపలు పట్టడానికి వెళ్లిన విగ్నెష్ నదిలో మునిగి చనిపోయాడు. చిట్యాల గ్రామానికి చెందిన నక్క విగ్నేష్ ఎప్పటిలాగే పుట్టిలో చేపల వేటకు వెళ్ళాడు. ఒక్కసారిగా వల కాల్ల మధ్యలో ఇరుక్కుని నదిలో పడ్డాడు విగ్నేశ్. దీంతో వరద ఉధృతి పెరగడంతో నదిలో కొట్టుకుపోయాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న తోటి మత్స్యకారులు, నదిలో కొట్టుకుపోతున్న విగ్నేష్ ను కాపాడేందుకు విఫలయత్నం చేసారు. అప్పటికే పరిస్థితి చేజారడంతో నీళ్లు మింగి ఊపిరాడక మృత్యువాత పడ్డాడు. కాగా నాగార్జున సాగర్ 22 గేట్లు ఎత్తడంతో రెండు రోజులుగా వరద ఉధృతి పెరిగింది. దీంతో కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, చేపల వేటకు ఎవరూ వెళ్ళొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేసినా ఇలా చేపల వేటకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్