నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం కేంద్రంలోని పలు గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం నుంచి ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని ఆమనగల్లు, లక్ష్మీదేవిగూడెం, రావులపేట గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. మురుగు కాలువలు పోంగి నీరు రోడ్లపై ప్రవహించాయి.