నిబద్ధత కలిగిన రాజకీయవేత్త కొండా లక్ష్మణ్ బాపూజీ

473చూసినవారు
నిబద్ధత కలిగిన రాజకీయవేత్త కొండా లక్ష్మణ్ బాపూజీ
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవినే తృణప్రాయంగా త్యజించిన నిబద్ధత గల రాజకీయవేత్త కొండా లక్ష్మణ్ బాపూజీ అని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. తెలంగాణ స్వాంత్రంత్య సమరయోధుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ 9వ వర్ధంతి సందర్భంగా ఎన్ఎస్పీ క్యాంపులోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన చిత్ర పటానికి శ్రద్ధాంజలి ఘటించి భాస్కర్ రావు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడారు. స్వరాష్ట్ర సాధన, బడుగు బలహీనవర్గాల అభివృద్ధి కోసం బాపూజీ ఎన్నో ఉద్యమాలు చేశారని చెప్పారు. పీడిత పక్షాన తన గళాన్ని వినిపించిన స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ ఏర్పాటుకు తాను ఉంటున్న జల దృశ్యాన్ని అప్పగించిన మహోన్నత వ్యక్తి గా కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రలో నిలిచిపోతారన్నారు. బాపూజీ సేవలు తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు స్కై లాబ్ నాయక్, సైదిరెడ్డి, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి షోయబ్, భిక్షం, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్