రేపు జిల్లాలో మంత్రుల పర్యటనలు

1486చూసినవారు
రేపు జిల్లాలో మంత్రుల పర్యటనలు
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజక వర్గంలో 7-8-2021 శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్ది పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉ. 10 గం. లకు వేములపల్లి మండలం వేములపల్లి గ్రామంలో రైతు వేదిక ప్రారంభోత్సవం చేయనున్నారు. ఉ. 10-30 కు వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామములో రైతు వేదిక ప్రారంభోత్సవం చేస్తారు. ఉ. 11 గం. లకు మిర్యాలగూడ మండలం తుంగపహాడ్ గ్రామంలో రైతు వేదిక ప్రారంభోత్సవం చేయనున్నారు. ఉ. 11. 30కు దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామంలో రైతు వేదిక ప్రారంబోత్సవం చేస్తారు. మ. 12. 00 కు దామరచర్ల మండలం దామరచర్ల గ్రామంలో రైతు వేదిక ప్రారంభోత్సవం అనంతరం రైతు సభ నిర్వహిస్తారు. మ. 1. 00 గంటకు మిర్యాలగూడ పట్టణం ఎన్ఎస్పీ క్యాంప్ రైతు బజార్ వెనుక నూతనంగా నిర్మించిన భూసార పరీక్ష కేంద్ర భవనం ప్రారంబోత్సవం చేయనున్నారు. మ. 2-30 కు మిర్యాలగూడ పట్టణం షాబు నగర్, ఎంపీడీఓ కార్యాలయం పక్కన నిర్మాణం పూర్తి అయిన రైతు వేదిక ప్రారంభోత్సవం కార్యక్రమం కలదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్