పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే

56చూసినవారు
పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే
సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిబాపూలే ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి అన్నారు. గురువారం పూలే 198వ జయంతి పురస్కరించుకొని వివిధ సంఘాల ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. నిమ్నజాతుల సంక్షేమం విద్య అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుడు పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో నూకల వేణుగోపాల్ రెడ్డి, మాడుగుల శ్రీనివాస్, రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్