మహిళను తొక్కుకుంటూ పోయిన కారు (వీడియో)

4907చూసినవారు
ఢిల్లీలోని నంద్ నగ్రి ప్రాంతంలో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. దంపతులు బైక్‌పై వెళ్తుండగా ఓ కారు వారిని ఢీకొట్టింది. అనంతరం బైక్‌పై నుంచి కింద పడ్డ మహిళను ఆ కారు తొక్కుకుంటూ దూసుకెళ్లింది. ప్రమాదం తర్వాత కారుతో సహా డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఆ మహిళ తీవ్రగాయాల పాలైంది. ఆమెను భర్త ఆసుపత్రిలో చేర్పించాడు. పరిస్థితి విషమంగా ఉంది. కారు డ్రైవర్ సన్నీ రావల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్