మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం బీసీ ఆఫీసులో సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా కార్యదర్శి బంటు కవిత, బీసీ సంఘం నాయకులు చేగొండి మురళీ యాదవ్, సురేష్ రాజ్ కుమార్ పాల్గొన్నారు.