జులై 3న నల్గొండ కలెక్టరేట్ ఎదుట ధర్నాను జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా సహాయక కార్యదర్శి, వైస్ ఎంపీపీ పాదూరు గోవర్ధన అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన పేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాల కోసం మరియు సొంత స్థలం ఉన్నవారికి ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని మహిళా సంఘం ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి పాదూరు గోవర్ధన డిమాండ్ చేశారు.