యువకుడు అదృశ్యం

56చూసినవారు
యువకుడు అదృశ్యం
అత్తారింటికి వెళ్తానని కొడుకు కనిపించకుండా పోయిన ఘటన మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ పెరిక రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన పచ్చిపాల లింగరాజు (25) ఈ నెల 13న చివ్వెంల మండలం తిమ్మాపురం గ్రామంలోని తన అత్త మామల ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరి వెళ్లాడు. ఇప్పటికీ అక్కడకు వెళ్లకపోవడంతో పాటు ఆచూకీ లభించకపోవడంతో అతని తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్