నీటిని వృధా చేయకూడదు : ఉపాధ్యాయుడు లచ్చిరామ

3741చూసినవారు
తేరట్పల్లి ప్రాథమకోన్నత పాఠశాల ఆవరణంలో అంగన్వాడి కేంద్రాలు 1, 2 లు కూడా ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకు త్రాగునీటి కోసం పాఠశాలలో మిషన్ భగీరథ నల్ల కనెక్షన్ కూడా ఇచ్చారు. అయితే సోమవారము అంగన్వాడి కేంద్రం ఆయా నీటి కోసం వచ్చి నల్ల దగ్గర బిందె పెట్టి వెళ్లిపోయింది. బిందె నిండి నీరు చాలా సేపు వృధాగా పోతుంటే గమనించిన ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరాం వెంటనే నల్ల ఆఫ్ చేసి ఆయాను పిలిచి బిందె నిండి చాలాసేపు అయి నీరు వృధాగా పోతుందని, ముఖ్యంగా ఎండాకాలంలో నీటి అవసరం చాలా ఉంటుంది కనుక నీటిని వృధా చేయకూడదని తెలియజేశారు. ఉపాధ్యాయుడు లచ్చిరామ్ చెప్పిన మాటలకు ప్రభావితం అయిన ఆయా ఇక ఎప్పుడు నీటిని వృధా చెయ్యనని మాట ఇచ్చింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ నీరు, విద్యుత్, ఆహారం ను ఎప్పుడూ వృధా చేయకూడదని సమాజానికి వీటి ఆవశ్యకత చాలా ఉందని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్