నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండడంతో 26 గేట్లును ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం జలాశయానికి 3, 59, 851 క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతే నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు నీటి మట్టం 590 అడుగులకుగాను 588 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకుగాను, 306. 1010 టీఎంసీల నీటి నిల్వ ఉంది.