చిట్యాల: కూలీల రేట్లు పెంచడానికి మేస్త్రీల సంఘం అంగీకారం

60చూసినవారు
చిట్యాల: కూలీల రేట్లు పెంచడానికి మేస్త్రీల సంఘం అంగీకారం
చిట్యాల భవన నిర్మాణ దినసరి కూలీల రేట్లు పెంచడానికి మేస్త్రీల సంఘం అంగీకరించినట్లు సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ తెలిపారు. చిట్యాల మండల కేంద్రంలో ఆదివారం భవన నిర్మాణ కార్మిక సంఘం మేస్త్రీలకు, దినసరి కూలీల మధ్య నూతన రేట్ల ఒప్పందం జరిగినట్లు తెలిపారు. దినసరికూలికి అదనంగా రోజుకు 50 రూపాయలు పెంచివ్వడానికి మేస్త్రిల సంఘం ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం ఒక ఏడాది పాటు ఉంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్