చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన సిపిఎం సానుభూతి పరుడు అక్కెనపల్లి అమృతయ్య (66) అనారోగ్యం కారణంగా మృతి చెందటం పట్ల ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం వట్టి మర్తి గ్రామానికి వెళ్ళి అమృతయ్య మృతదేహం పై పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు.