చిట్యాల పట్టణ కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీలో సుశీల గోపాలన్ వర్థంతి సందర్భంగా గురువారం ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్ట సరోజ (ఐద్వా) జాతీయ నాయకురాలు సుశీల చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. గోపాలన్ మహిళా హక్కుల కోసం కడవరకు పోరాడారని అన్నారు. పేద ప్రజల కోసం నిరంతరం పని చేసిన సుశీల గోపాలన్ సేవలను మహిళలు, విద్యార్థినీలు మరువకూడదని కొనియాడారు.