చిట్యాల మండల కేంద్రంలో గురువారం సీపీఎం, రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఐతరాజు నర్సింహా, సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు జిట్ట సరోజ నల్ల జెండాలు, బ్యానర్ లతో ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తిరిగి తీసుకురావాలనే యోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.