మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నల్లగొండ జిల్లాలో 648 ఎకరాల్లో వరి, పత్తి, మిరప పంటలు నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. అందులో వరి 555 ఎకరాల్లో, పత్తి 90, మిర్చి 3 ఎకరాల్లో నీట మునిగి 33 శాతానికి పైగా పంటలకు నష్టం జరిగినట్లు వెల్లడించింది. జిల్లాలో 45 మంది రైతులకు సంబంధించి పంటలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 22చోట్ల ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.