సెప్టెంబర్ 20 నుంచి ఈ జీమెయిల్ ఖాతాలన్నీ రద్దు
గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 2 సంవత్సరాల పాటు యాక్టివ్గా లేని జీమెయిల్ ఖాతాలను గూగుల్ తీసివేయనుంది. సెప్టెంబర్ 20, 2024 నుంచి గూగుల్ అలాంటి Gmail ఖాతాలను తొలగిస్తుంది. అయితే గూగుల్ వారి ఖాతాలను తొలగించడానికి ముందు జీమెయిల్ వినియోగదారులకు నోటిఫికేషన్ను జారీ చేయనుంది. తద్వారా Gmail వినియోగదారులు వారి డేటాను భద్రపరుచుకోవచ్చు.