కట్టంగూర్ మండల కేంద్రంలో స్థానిక నర్రా రాఘవ రెడ్డి భవనంలో జరిగిన రైతు సంఘం మండల మహా సభ సందర్బంగా రాష్ట్ర మహిళా కన్వీనర్ కందాళ ప్రమీల ముఖ్య అతిగా హాజరై మాట్లాడుతూ ఈ నెల 22 వ తారీఖున మిర్యాలగూడ పట్టణంలో జరిగే 23 వ జిల్లా రైతు సంఘం మహాసభలు జయప్రదం చేయాలని కోరారు. కేంద్రం తెచ్చిన నల్ల చట్టఉపసంహారణ సందర్బంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, విద్యుత్ సవరణ చట్టాల్ని ఉపసంహరించుకోవాలనీ, రాష్ట్ర ప్రభుత్వం అర్హులు అందరికి రైతు బందు, బీమా కల్పించి పోడు, కౌలు రైతులని ఆదుకోవాలని, రైతు రుణ మాఫీ చేయాలనీ కోరారు 57 సంవత్సరాలు నిండిన వారికి అందరికీ పేన్షన్ అందజేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతు సంఘం 19 మంది తో నూతన మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది ప్రధాన కార్యదర్శి గా ఉట్కూరు యాదయ్య, అధ్యక్షులు కక్కిరేణి రామస్వామి ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు పెంజర్ల సైదులు, యన్న నర్సిరెడ్డి, గుండమళ్ళ బిక్షం, GMPS మండల నాయకులు జాల రమేష్, మండల కార్యదర్శి దండేంపల్లి శ్రీను మారేబోయిన లష్మినారాయణ, సాగర్, కృష్ణ, దుర్గయ్య, వనం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.