నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం కట్టంగూర్ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు వాహనాలు అదుపుతప్పి ఒకదానికొకటి 4 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.