నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి యాదగిరి ఆదివారం రాత్రి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో అనారోగ్యంతో మరణించారు. సోమవారం ఎల్లారెడ్డిగూడెంలో నిర్వహించిన యాదగిరి అంతిమ యాత్రలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తుల ఉషయ్య తదితరులు ఉన్నారు.