మునుగోడు: ఎమ్మెల్యే గైర్హాజరుపై చర్చ

67చూసినవారు
మునుగోడు: ఎమ్మెల్యే గైర్హాజరుపై చర్చ
నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం యాదాద్రి జిల్లాలో కొనసాగిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు గైర్హాజరు కావడంపై శనివారం జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది. రాజగోపాల్ రెడ్డి వేరే టూర్ లో ఉండి రాలేక పోయారా, కావాలనే సీఎం టూర్ కు రాలేదా అనే విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ విషయంపై ఎమ్మెల్యే స్పష్టత ఇస్తేనే ఊహాగానాలకు చెక్ పడే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్